Thursday, August 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించిన టిఎన్జీవోఎస్ ఉద్యోగులు

ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించిన టిఎన్జీవోఎస్ ఉద్యోగులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని సర్కిల్లో గల కాంస్య విగ్రహానికి టీఎన్జీవోస్ నిజామాబాద్ జిల్లా పక్షాన బుధవారం పూలమాలవేసి నివాళులర్పించి, స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్,నేతికుంట శేఖర్, టిఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్,జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, భీంగల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, ఎస్ అండ్ ఎల్ ఆర్  స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -