నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టరేట్ పర్యవేక్షకులు జగన్ మోహన ప్రసాద్ ఆధ్వర్యంలో 30 మంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగికి ఉండవలసిన లక్షణాలపై రెవెన్యూ విశ్రాంత ఉద్యోగి సురేష్ తో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రభుత్వ ఉద్యోగి విధి విధానాలను తెలియజేసారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10.30 గంటలనుండి సాయంత్రం 5గంటలవరకు విధులు నిర్వర్తించాల్సి ఉన్నా 24 గంటలపాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లేనని, పనుల విషయంలో నావల్ల కాదు, లేదు, నేను చేయలేను వంటివి మరచిపోవాలన్నారు. నిత్య విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకుంటునే, తోటి వారికి కూడా తెలియజేస్తూ పరిణితి సాధించాలని, ఉన్నతాధికారుల మన్ననలు పొందాలన్నారు. రెవెన్యూ అధికారిగా ముద్ర పడాలంటే రెవెన్యూ లోని సెక్షన్స్ అన్ని తెలుసుకొని ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ పి.ఆర్.రిజిస్టర్ నిర్వహించాలని తద్వారా ప్రతి ఫైల్ పై పట్టు సాధించగలుగుతారన్నారు. ప్రభుత్వ ఉద్యోగి హుందాగా ఉంటూ వ్యతిరేక భావనలు విడనాడుతూ, పాజిటివ్ దృక్పధం పెంపొందించు కోవాలన్నారు. రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాహన పొందాలని, తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలని, పొరపాట్లు చేయరాదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES