Thursday, July 17, 2025
E-PAPER
Homeకరీంనగర్ఆర్థికంగా బలపడేందుకు..స్వయం సమృద్ది..సాధించేందుకు

ఆర్థికంగా బలపడేందుకు..స్వయం సమృద్ది..సాధించేందుకు

- Advertisement -

– 8552 ఎస్ హెచ్ జీ లకు రూ.12 కోట్లు
– ఇందిరా మహిళా శక్తి కింద ఎస్ హెచ్ జీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లింపు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

మహిళామణులు ఆర్థికంగా బలపడేందుకు… స్వయం సమృద్ది సాధించేందుకు జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు(ఎస్ హెచ్ జీ)లు ఇందిరా మహిళా శక్తి కింద తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 2024- 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రుణాలు తీసుకొని, సకాలంలో చెల్లించిన జిల్లాలోని 8552 ఎస్ హెచ్ జీ)లకు దాదాపు రూ.12 కోట్ల వడ్డీ డబ్బులు పంపిణీ చేయనున్నది.. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు (ఎస్ హెచ్ జీ) 8552 లకు ఈ నెల 17వ తేదీన వేములవాడ నియోజకవర్గంలో…ఈ నెల 18వ తేదీన సిరిసిల్ల నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


నాలుగు నియోజకవర్గాల పరిధిలో..
వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ అర్బన్ మండలంలోని 365 ఎస్ హెచ్ జీ లకు రూ. 46.84 లక్షలు, వేములవాడ రూరల్ మండలంలోని 442 ఎస్ హెచ్ జీ లకు రూ.58.81 లక్షలు, చందుర్తి మండలంలోని 613 ఎస్ హెచ్ జీ లకు రూ.82.50 లక్షలు, రుద్రంగి మండలంలోని 325 ఎస్ హెచ్ జీలకు రూ.41.61 లక్షలు, కోనరావుపేట మండ లంలోని 910 ఎస్ హెచ్ జీ లకు రూ. 113. 32 లక్షలు, మొత్తం 2655 ఎస్ హెచ్ జీ లకు రూ. 3 కోట్ల 43 లక్షల వడ్డీ రానున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్ళపల్లి మండలంలోని 926 ఎస్ హెచ్ జీ లకు రూ. 124.40 లక్షలు, గంభీరావుపేట మండలంలోని 1004 ఎస్ హెచ్ జీ లకు రూ.141.34 లక్షలు, ముస్తాబాద్ మండలంలోని 1018 ఎస్ హెచ్ జీ లకు రూ. 138.68 లక్షలు, వీర్నపల్లి మండలంలోని 280 ఎస్ హెచ్ జీ లకు రూ.34.76 లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలంలోని 1022 ఎస్ హెచ్ జీ లకు రూ.150.85 లక్షలు.. మొత్తం 4250 ఎస్ హెచ్ జీ లకు రూ. 5కోట్ల 90 లక్షల వడ్డీ రానున్నది. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలోని 696 ఎస్ హెచ్ జీ లకు రూ. 98.90 లక్షలు, మానకొండూరు నియోజకవర్గంలోని 951 ఎస్ హెచ్ జీ లకు రూ.145. 51 లక్షల వడ్డీ రానున్నది.

మహిళా సంఘాల సభ్యుల్లో హర్షం..
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 8552 ఎస్ హెచ్ జీ లకు రూ. 11 కోట్ల 77 లక్షల 52 వేల వడ్డీ తిరిగి చెల్లించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాము తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లించనుండడంతో మహిళా సంఘాల సభ్యుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -