వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. జయశంకర్ దర్శకుడు.
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీరెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్. ఈ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జయశంకర్ మీడియాతో ముచ్చటించారు. ‘పేపర్ బాయ్’ మూవీ తరువాత చేసిన సినిమా ఇది. మన పురాణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప, ఎక్కడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు. వాటి ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించాను. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలి.
సాయి కుమార్, అనసూయ, వైవా హర్ష వంటి ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన వీరి పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. ఇందులో వీఎఫ్‌ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ వాళ్లు అలాగే వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి, అశ్వనీదత్ లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించి, మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. అలాగే హిందీలోఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ హీరో చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో దీన్ని రీమేక్ చేస్తా. ‘అరి’ లాంటి మూవీ చేయాలంటే నిర్మాతలకు అభిరుచితో పాటు ధైర్యం ఉండాలి. అలాంటి ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం సంతోషంగా ఉంది. ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుంది నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది ఈ చిత్ర నేపథ్యం. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ చిత్రీకరణకు వెళ్తున్నాం.
అరిషడ్వర్గాలను జయించాలంటే..?
- Advertisement -
- Advertisement -