Wednesday, April 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవియత్నాం అధ్యక్షుడిగా టో లామ్‌

వియత్నాం అధ్యక్షుడిగా టో లామ్‌

- Advertisement -

కమ్యూనిస్టు పార్టీ అధినేతను ఎన్నుకున్న పార్లమెంట్‌
హనోయ్ :
వియత్నాం కమ్యూనిస్టు పార్టీ అధినేత టో లామ్‌ దేశాధ్యక్షుడిగా ఎన్ని కయ్యారు. జాతీయ అసెంబ్లీ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించింది. లామ్‌ జనవరిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. మంగళవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రసంగిస్తూ ‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. దీనిని బాధ్యతగా, పవిత్రంగా, ఉన్నతంగా నిర్వర్తిస్తాను’ అని అన్నారు. జాతీయ అసెంబ్లీ సమావేశానికి హాజరైన డిప్యూటీలు అందరూ తీర్మానాన్ని సమర్థించి 2026-2031 కాలానికి లామ్‌ను దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారని జాతీయ అసెంబ్లీ ఛైర్మెన్‌ థన్‌ మన్‌ తెలిపారు. వియత్నాం అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా…రెండు పదవులకూ ఎంపికైన తొలి వ్యక్తి లామ్‌. వియత్నాంలో పది శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాలని, అదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని లామ్‌ నిర్దేశించుకున్నారు. ఈయన పదవీ కాలం ఐదేండ్లు (2026- 2031) కొనసాగుతుంది. ఈ విషయాన్ని వియత్నాం జాతీయ అసెంబ్లీ మంగళవారం ధృవీకరించినట్టు జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.
వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌కి మోడీ అభినందనలు
వియత్నాం అధ్యక్షుడిగా ఎన్నికైన టో లామ్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. టో లామ్‌ నాయకత్వంలో న్యూఢిల్లీ, హనోరు మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘వియత్నాం సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన టో లామ్‌కి నా హృదయ పూర్వక అభినందనలు. ఆయన నాయకత్వంలో భారత్‌- వియత్నాం దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన స్నేహం మరింత బలపడుతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. మన ప్రజల ప్రాంతం పురోగతి, శ్రేయస్సు కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మీతో కలిసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని మోడీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -