Saturday, July 19, 2025
E-PAPER
Homeమానవిబరువు తగ్గాలంటే..?

బరువు తగ్గాలంటే..?

- Advertisement -

సాధారణంగా మధ్యాహ్నం పూట చాలా మంది కాస్త ఎక్కువగానే ఆహారం తీసుకుంటారు. ఇలా భారీ భోజనం చేసిన తర్వాత సాయంత్రం పూట కూడా అధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి డేంజర్‌ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఎలాంటి ఆహారం తినకూడదో నిపుణుల మాటల్లో మీ కోసం..

శీతల పానీయాలు
సూర్యాస్తమయానికి ముందు, తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శీతల పానీయాలు తీసుకోకూడదు. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. చక్కెర అధికంగా ఉండే సోడా పానీయాలు ఆరోగ్యానికి చాలా హానికరం. అవి బరువు పెరగడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. శీతల పానీయాలతోపాటు ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండాలి.

చీజ్‌
చాలా ఫాస్ట్‌ ఫుడ్స్‌ లో చీజ్‌ ఉంటుంది. పిజ్జా, బర్గర్‌, పాస్తా వంటి ఆహారాలలో చీజ్‌ తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో ఉప్పు, సోడియం ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో సంతప్త కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. ఇటువంటి ఆహారాలు కొలెస్ట్రాల్‌, రక్తపోటు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి.

ప్రాసెస్‌ చేసిన ఆహారాలు
సాసేజ్‌లు, బేకరీల నుంచి ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ వరకు-ఈ రకమైన ఆహారాలలో చక్కెర, ఉప్పు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అవి బరువును పెంచుతాయి. అలాగే బహుళ వ్యాధుల ప్రమాదాన్ని సష్టిస్తాయి. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

బరువు తగ్గడానికి…
ప్రోటీన్‌ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. ప్రొటీన్‌ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పని చేయడానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే మఖానా, ఉడికించిన శనగలు వంటి ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి కడుపుని నింపడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -