టీ. జుడా కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో తెలంగాణ స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయించడం పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు టీ-జుడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(టి-జుడా) అధ్యక్షులు డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజరు, జూనియర్ డాక్టర్లు ఆయన నివాసంలో కలిశారు. పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో తెలంగాణ స్థానిక విద్యార్థులకు 85 శాతం కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దకాలంగా ఉన్న తెలంగాణ వైద్య విద్యార్థుల ఆశయం నెరవేరిందనీ, రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు స్థానికంగా మెడికల్ విద్య, స్పెషాలిటీ ట్రైనింగ్ అవకాశాలు విస్తృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ వైద్య కమిషన్ నుంచి కొత్తగా మరిన్ని పీజీ సీట్లు రాష్ట్రానికి దక్కడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను అభినందించారు. సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టి నాయకత్వాన్ని, మంత్రి దామోదర రాజనరసింహ మార్గదర్శకత్వంలో ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వైద్య విద్య, ఆరోగ్య సేవా రంగంలో జరుగుతున్న సంస్కరణలను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్దతు, సహకారం ఉంటుందని ప్రకటించారు.
మంత్రి దామోదర రాజనరసింహకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



