జపాన్‌తో భారత్ ఢీ నేడు
మహిళల హాకీ ఆసియా కప్
గాంగ్షూ (చైనా) : మహిళల హాకీ ఆసియా కప్‌లో టీమ్ ఇండియా నేడు కఠిన పరీక్షకు సిద్ధమవుతోంది. సూపర్4 దశలో దక్షిణ కొరియాపై 4-2తో నెగ్గిన భారత అమ్మాయిలు.. ఆతిథ్య చైనా చేతిలో 1-4తో పరాజయం పాలయ్యారు. టాప్-2లో నిలిచిన జట్లు మాత్రమే ఫైనల్‌కు చేరనుండగా.. సూపర్4 దశ ఆఖరు మ్యాచ్‌లో నేడు జపాన్‌తో భారత్ తలపడనుంది. జపాన్ తొలి మ్యాచ్‌ను 1-1తో దక్షిణ కొరియాతో డ్రా చేసుకుంది. చైనా చేతిలో 0-2తో ఓటమి చెందింది. రెండు విజయాలతో చైనా ఫైనల్‌కు అర్హత సాధించగా.. మరో బెర్త్ కోసం భారత్, జపాన్, దక్షిణ కొరియా పోటీపడుతున్నాయి. గ్రూప్ దశలో జపాన్‌తో 2-2తో డ్రా చేసుకున్న భారత్.. నేడు కీలక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఫైనల్‌కు చేరుకునే వీలుంది. మరో మ్యాచ్‌లో చైనాతో దక్షిణ కొరియా తలపడనుంది. భారత్ నుంచి ముంతాజ్ ఖాన్, నేహా, లాల్‌రెమిసియామి, నవనీత్ కౌర్, ఉదిత, షర్మిళ, రుతుజలు నేడు కీలకం కానున్నారు.