Wednesday, February 18, 2026
E-PAPER
Homeసినిమాచిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా..

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా..

- Advertisement -

ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని తన ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై ‘సమ్మర్‌ హాలిడేస్‌’ పేరుతో కొత్త సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. చిల్డ్రన్‌ మూవీగా నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ను బుధవారం అనౌన్స్‌ చేశారు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్‌ రోహన్‌ రాయ్, మాస్టర్‌ అరుణ్‌ కీలక పాత్రల్లో నటించారు.

రోహన్‌ రాయ్ ‘నైన్టీస్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్టర్‌ అరుణ్‌ ’35 చిన్న కథ కాదు’ సినిమాతో ఫేమ్‌ అయ్యారు. వీళ్లిద్దరికీ ఈ మూవీ మరింత పేరు తీసుకురానుంది. మే 1 ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈచిత్రానికి డీవోపీ – సాయి ప్రకాష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ – సింజిత్‌ యెర్రమల్లి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -