Wednesday, April 8, 2026
E-PAPER
Homeమానవికిచెన్‌ ఫ్లోర్‌పై జిడ్డు పోవాలంటే..

కిచెన్‌ ఫ్లోర్‌పై జిడ్డు పోవాలంటే..

- Advertisement -

కిచెన్‌ని ఎప్పటికప్పుడు నీట్‌ అండ్‌ క్లీన్‌గా ఉంచుకోవాలి. కానీ, మనం వంటచేసే క్రమంలో నూనె మరకలు పడటం, ఇతర పదార్థాలు పడి మిగతా రూమ్‌ల కంటే త్వరగా జిడ్డుగా మారతాయి. ఫ్లోర్‌పై ఎన్నో మరకలు పడి త్వరగా జిడ్డుపేరుకుపోతుంది. దీంతో ఈ ఫ్లోర్‌ని కూడా మిగతా ఫ్లోర్స్‌లానే క్లీన్‌ చేస్తామంటే కుదరదు. దీనికోసం ఇంట్లోని పదార్థాలతో ఎలా క్లీన్‌ చేసుకోవచ్చో చూద్దాం…

వేడి నీటిలో వైట్‌ వెనిగర్‌
బకెట్‌ లేదా స్ప్రే బాటిల్‌లో వైట్‌ వెనిగర్‌, గోరువెచ్చని నీటిని సమాన భాగాలు తీసుకోండి. దీనిని మరకలు ఉన్న చోట బాగా కలిపి స్ప్రే చయండి. దీనిని ముందుగా బ్రష్‌తో స్క్రబ్‌ చేయండి. తర్వాత మాప్‌తో నేలపై క్లీన్‌ చేయండి. మరకలు ఉన్న చోట ఎక్కువగా రుద్దండి. దీని వల్ల స్క్రబ్‌ చేసిన తర్వాత మరకలు పూర్తిగా పోయి నీట్‌గా మారుతుంది.

బేకింగ్‌ సోడా పేస్ట్‌
బేకింగ్‌ సోడా అనేది బెస్ట్‌ డీగ్రేసింగ్‌ లక్షణాలను కలిగి ఉన్న మరో పదార్థం. దీంతో పేస్ట్‌ తయారు చేయండి. దీనికోసం కొద్దిగా బేకింగ్‌ సోడాలో నీటిని కలిపి పేస్టులా చేయండి. దీనిని వంటగదిలోని మరకలపై అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత బ్రష్‌, స్పాంజ్‌తో స్క్రబ్‌ చేయండి తర్వాత నీటితో క్లీన్‌ చేయండి. తర్వాత పొడిగుడ్డతో క్లీన్‌ చేయండి.

నిమ్మరసం, వేడి నీరు
నిమ్మరసాన్ని వాడడం వల్ల మరకలు పోవడమే కాకుండా మంచి సువాసనలు కూడా వస్తాయి. దీనికోసం తాజా నిమ్మరసాన్ని ఓ బకెట్‌ వేడి నీటిలో పిండండి. నిమ్మరసం ద్రావణాన్ని జిడ్డు మరకలు ఉన్న చోట రాయండి. దీనికోసం స్పాంజ్‌, మాప్‌ వాడండి. దీనిని కాసేపు అలానే ఉంచండి. బ్రష్‌, మాప్‌తో నేలని కొద్దిగా స్క్రబ్‌ చేయండి. తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్‌ చేయండి. తర్వాత పొడిగుడ్డతో క్లీన్‌ చేయండి.

మరకలు పడగానే
విసుక్కోకుండా ఏవైనా మరకలు పడగానే వెంటనే క్లీన్‌ చేయడం మంచిది. ఎక్కువ రోజులు అలానే ఉంచితే అవి పూర్తిగా ఆరిపోయి నేలంతా మరకలు, జిడ్డుగా మారతాయి. ఈ టిప్స్‌ అన్నీ ఫ్లోర్‌పైనే కాకుండా కౌంటర్‌ టాప్‌ కప్‌బోర్డ్స్‌ వంటి చోట్ల కూడా రాయండి. అయితే చెక్క వస్తువులపై మరీ ఎక్కువసేపు ఉంచొద్దు. లేకపోతే నాని మరకలు మొండిగా మారతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -