– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చిరంజీవి
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక సమస్యలు పరిష్కారించాలన్నా, ఆ సమస్యలు ను అధికారులు దృష్టి కి తీసుకెళ్ళాలన్నా స్థానిక సంస్థల ల్లో కమ్యూనిస్టు లు ప్రాతినిధ్యం ఉండాలంటే కాంగ్రెస్ బలపరిచిన 21 వ వార్డు సీపీఐ (ఎం) అభ్యర్థిని తగరం నిర్మలను అత్యధిక ఆధిక్యం తో గెలిపించాలని సీపీఐ (ఎం) జిల్లా నాయకులు చిరంజీవి, కాంగ్రెస్ నాయకులు కేపీ ఇబ్రహీం లు ఇరు పార్టీల శ్రేణులు కు పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీ పరిధిలోని 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తగరం నిర్మల విజయం కాంక్షిస్తూ సీపీఐ (ఎం), కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణం అయినా, పల్లెటూరు అయిన పేదలు పక్షాన నిలబడి పోరాడే ది కమ్యూనిస్టు లేనని, కాంగ్రెస్ హయాం లో నే పేదలకు నిజమైన సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ (ఎం) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



