- Advertisement -
నవతెలంగాణ- తాడూర్
నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం తిరుమలపూర్ గ్రామానికి గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వర్షపు నీరు నిలవడంతో విద్యార్థులు చదవుకోవడానికి వాగు దాటి నీటిలో వెళ్లాల్సి వస్తుంది. ఏదైనా ప్రమాదం వాటిల్లితే తీవ్ర విషాదం చోటు చేసుకోక ముందే సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
- Advertisement -



