ఖమ్మంలో ఒక్క సీటూ రాదు
కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
మాపై ఆరోపణలు చేస్తే జాగ్రత్త అంటూ హెచ్చరిక
ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజాప్రభుత్వం
నవతెలంగాణ -బూర్గంపాడు
గత ఎన్నికల్లో మాదిరిగానే.. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు అధికారం దక్కనీయబోమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికి నువ్వైనా.. మీ నాన్న కేసీఆర్ అయినా సిద్ధమా అంటూ.. మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి స్పందించారు. గడచిన పదేండ్లలో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఇతర దేశాల్లో కాలక్షేపం చేయాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని, అంతేగానీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఏమీ చేయలేదని ఆరోపణలు చేస్తే మాత్రం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న కాలంలో పేదోడికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ హయాంలో 60 వేల ఇండ్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 18నెలల్లో 4 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. ఇది దొరల ప్రభుత్వం కాదని.. ప్రజల చేత దీవించబడిన ప్రజా ప్రభుత్వమని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. దీన్ని చూసి ఓర్వలేకనే.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రేషన్ షాపుల వద్ద ప్రజలు క్యూలో ఉంటున్నారని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు వద్ద క్యూలో ప్రజలు ఉంటే కనిపించని మాజీ మంత్రికి సన్న బియ్యం ఇస్తుంటే కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, మాజీ జెడ్పీటీసీ బట్టా విజయ గాంధీ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES