Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెర్కిట్ ఉన్నత పాఠశాలలో పొగాకు నియంత్రణ కార్యక్రమం

పెర్కిట్ ఉన్నత పాఠశాలలో పొగాకు నియంత్రణ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
మున్సిపాలిటీ పరిధిలో ని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పొగాకు నియంత్రణ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా గోవింద్ పెట్ పి.హెచ్.సి వైద్యురాలు మానస మాట్లాడుతూ.. పొగాకు తో తయారైన మత్తు పదార్థాలు సిగరెట్టు, గుట్కా, తంబాకు , జరద  వంటి పదార్థాలను తినకూడదని, మత్తు పానీయాలను త్రాగకూడదని, వాటి ద్వారా వచ్చే అల్సర్, పక్షవాతము, రక్తం గడ్డ కట్టడం జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని  సూచించారు.

ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాస్ మాట్లాడుతూ  చెడు వ్యసనాలు చెడు స్నేహం చేయకూడదని మంచి అలవాట్లను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు  వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -