– ఆంధ్రా టుబాకో బోర్డు లో తెలంగాణ పంట అమ్మకం
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎన్ఎల్ఎస్ ( నార్త్ లైట్ సాయిల్) దక్షిణ ప్రాంత తేలికపాటి నేలల్లో సాగు అయ్యే పొగాకు పంట వేలం ఆంధ్ర ప్రదేశ్,ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం లోని ఆంధ్ర పొగాకు బోర్డు 32 ప్లాట్ ఫారంలో బుధవారం ప్రారంభమైంది.
తెలంగాణా రైతులకు చెందిన మొత్తం 99 బేల్స్ కు వేలం జరగగా మొత్తం అమ్ముడయ్యాయి.గరిష్ట ధర క్వింటాల్ కు రూ.265 లభించింది.ఈ ధర గత సంవత్సరం ప్రారంభ ధరతో పోలిస్తే రూ.25 తక్కువగా ఉన్నప్పటికీ, రైతులు మంచి ధరలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వేలంలో ఐటీసీ ,జీపీఐ,పీఎస్ ఎస్, డెక్కన్ అనే నాలుగు కంపెనీల బయ్యర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, రీజినల్ మేనేజర్ సురేంద్ర, ఏఎస్ మార్గరెట్ గ్రేస్, రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకటరావు, సెక్రటరీ వి.వి.ఎస్. ప్రకాశ్ రావు, సుంకవల్లి వీరభద్రరావు, కూకులకుంట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



