- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం, మార్చి 5న విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు సెకండరీ బోర్డు వెబ్‌సైట్, తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్‌లు, లేదా పాఠశాలల ద్వారా ప్రింటెడ్ హాల్‌టికెట్లను పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే సెంటర్ తెలుసుకుని నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
- Advertisement -



