- Advertisement -
న్యూఢిల్లీ : ఒమన్‌తో గురువారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగనుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్ తెలిపారు. మస్కట్‌లో జరిగిన ఇండియా, ఒమన్ బిజినెస్ ఫోరమ్‌లో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఒప్పందం భారత్‌కు వస్త్రాలు, పాదరక్షలు, ఆటోమొబైల్స్, రత్నాలు, ఆభరణాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటో విడిభాగాలతో సహా అనేక రంగాలలో అపారమైన అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతం, తూర్పు యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా వంటి ఇతర మార్కెట్‌లకు ఒమన్ ద్వారా లభించే ప్రవేశం వల్ల భారత్ మరింత ప్రయోజనం పొందుతుందని తెలిపారు.
- Advertisement -



