Monday, January 19, 2026
E-PAPER
Homeసినిమానేడు హెచ్‌.ఎం.రెడ్డి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

నేడు హెచ్‌.ఎం.రెడ్డి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

- Advertisement -

ప్రముఖ సినీ చరిత్ర పరిశోధకుడు హెచ్‌.రమేష్‌బాబు రచించిన హెచ్‌.ఎం. రెడ్డి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ వేడుక నేడు (సోమవారం) సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి మినీ హల్లో ఘనంగా జరగనున్నట్లు తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షులు లారా తెలిపారు.
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, తెలం గాణ సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహి స్తున్న ఈ వేడుకలో దర్శకులు బి.నరసింగ రావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. నాగర్‌ కర్నూల్‌ శాసన సభ్యులు డా||కె.రాజేశ్‌రెడ్డి, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంకర్‌, అల్లాణిశ్రీధర్‌, ప్రేమ్‌రాజ్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, కవి కమలాకర్‌రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -