Wednesday, October 8, 2025
E-PAPER
Homeజాతీయంనేడు వైమానిక దళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

నేడు వైమానిక దళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు 93వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి, ఆ రంగంలోని అనువజ్ఞులకు, వారి కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాక్షలు తెలిపారు. దేశానికి సేవ చేయడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ నిబద్ధత, ధైర్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించింది. మన వైమానిక యోధులు మన ఆకాశాన్ని రక్షిస్తారు. విపత్తులు సంభవించినప్పుడు మానవతా కార్యాకలాపాల సమయంలో వైమానిక దళ సిబ్బంది అవిశ్రాంతంగా అంకితభావంతో దేశానికి సేవ చేస్తారు. మన వైమానిక దళం ప్రతి సవాల్‌ను ఎదుర్కోవడానికి తన బలం, సంసిద్ధతతో దేశాన్ని గర్వపడేలా చేసింది. భారత వైమానిక దళం భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ముర్ము తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -