Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్నేడు మాతృ దినోత్సవం.!

నేడు మాతృ దినోత్సవం.!

- Advertisement -

కాటారం డివిజన్ ఆర్టిఐ నేత…చింతల కుమార్ యాదవ్..
నవతెలంగాణ – మల్హర్ రావు
: మాతృ దినోత్సవ, తల్లి యొక్క గొప్పతనం. అమ్మ ఒడి ప్రేమ స్వర్గం. అమ్మ అనే పిలుపు అమృతం. అమ్మ ఇస్తుందని, కాటారం డివిజన్ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ చింతల కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా మాట్లాడారు. జీవితం అమ్మకు తన బిడ్డ సర్వస్వం. అమ్మ రక్తాన్ని మాంసపు ముద్దగా చేసి అమ్మ ఊపిరిని ప్రాణంగా పోసి అమ్మ కడుపులో నవ మాసాలు మోసి బిడ్డకు ఇస్తుందన్నారు. కొత్త ప్రపంచం. ఆమె నడయాడిన ఇల్లు ఒక బృందావనం. ఆమె చిరునవ్వులు కలిగించు హృదయానందనం. ఆమె చనుబాలతో పంచిన ధైర్యమే ప్రేమ ఎప్పటికీ తీర్చలేని రుణమన్నారు. ఆమె పెట్టిన గోరుముద్ద మనకి అమృత సమానం. ఆమె పలుకులు దాటించు దుఃఖ సాగరం. సృష్టిలో  తీయనైన పదము అమ్మ. అమ్మను మించిన దైవం లేదు. అమ్మ రుణం తీర్చలేనిది. ప్రతీ ఏటా  మాతృదినత్సవంను జరుపుకుంటారు . మాతృ దేవత మీద భక్తిని ప్రకటిస్తూ మాతృ దినోత్సవానికి పెరిగిన ఆదరణ వల్ల ఇంటర్నేషనల్ మదర్స్ డే సంస్థ ఏర్పాటు అయింది. సృష్టిలో ప్రతి మనిషిని నవ  మాసాలు మోసి పెంచిన తల్లి ప్రాధాన్యత ఎనలేనది. అమ్మ ఆప్యాయత, మమకారం , అనురాగం వెలకట్టలేనిది. అనురాగమూర్తి అమ్మ. అమ్మ మంచితనం ఎంత చెప్పినా తక్కువే. కనిపించని దైవం కన్నా కనిపించే దైవం అయిన అమ్మ రుణం తీర్చుకోలేనిది. అమ్మ మాట ఎంతో మధురము. పిలుపు ఎంతో సులభము. ఇటీవల కాలంలో అనేకమంది కుమారులు, కుమార్తెలు తమ తల్లుల పట్ల వివక్షత చూపిస్తూ దూరం పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తల్లులకు కుమారులు సరైన సేవ చేయకుండా వృద్ధాశ్రమాల్లో  చేర్పిస్తున్నారు. ఇలాంటి బాధాపత్త ఘటనలు ఎన్నో ఉన్నాయి. తనను చూసుకున్నా.. నా పిల్లలు పట్టించుకోవట్లేదని ఎవరినతోనూ చెప్పుకోకుండా.. తనలోనే మథనపడుతుంది. అదే అమ్మ మనసు. తన పిల్లల ఆదరాభిమానాలు చూరగొని ప్రశాంతంగా ప్రతి తల్లి మెలగాలని ఆశిస్తూ.. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -