Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు టీజీసెట్‌ -2026

నేడు టీజీసెట్‌ -2026

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం టీజీసెట్‌-2026 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. 2026-27లో గురుకులాల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షను రాసేందుకు 1,82,061 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గురుకుల కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కోసం రాష్ట్రంలో 492 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు టీజీ సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)కార్యదర్శి ఎస్‌.కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల సంస్థలు అందిస్తున్న నాణ్యమైన, విలువల ఆధారిత విద్యపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను పరీక్షకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -