పలు సభలకు ముఖ్యఅతిథులుగా ఎంఏ బేబీ, బృందాకరత్, బివి.రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం జరగనున్నాయి. ఈ సభలకు సీపీఐ(ఎం) అగ్ర నాయకుల రానున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఈనెల 10 నుంచి 17 వరకు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ జిల్లాల్లో సభలు, ప్రదర్శనలు, జాతాలు జరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ ఆఫీసు కార్యదర్శి జె బాబురావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట పోరాటం వాస్తవాలు వక్రీకరణపై అనేక చోట్ల సభలు, సదస్సులు జరిగాయని వివరించారు. ఈ వార్షికోత్సవాల్లో చివరిరోజైన సెప్టెంబర్ 17న వివిధ జిల్లాల్లో తమ పార్టీ అగ్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు జనగామలో వార్షికోత్సవాల సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీతోపాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.
అదేరోజు సాయంత్రం ఖమ్మంలో జరిగే సభలో ఎంఏ బేబీతోపాటు పార్టీ కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు హాజరవుతారని తెలిపారు. బుధవారం ఉదయం నల్లగొండలో జరిగే సభలో సీపీఐ(ఎం) అఖిలభారత సీనియర్ నాయకులు బృందాకరత్ ప్రసంగిస్తారని వివరించారు. ఆమెతోపాటు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతర జిల్లా నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సూర్యాపేటలో జరిగే సభలో బృందాకరత్ పాల్గొంటారని తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలో జరిగే సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొంటారని పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద అనాజ్‌పూర్‌లో జరిగే సభలోనూ ఆయన పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద జరిగే సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, టి జ్యోతి పాల్గొంటారని వివరించారు.
నేడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES