నవతెలంగాణ – ముధోల్
నేటి బాలలే రేపటి పౌరులని ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కు మంచి పేరు తేవాలని అన్నారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం కూడా నిర్వహించారు. దీంతో విద్యార్థులు తీసుకొచ్చిన వివిధ రకాల తినుబండారాలను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులు ప్రతి రోజూ తప్పనిసరిగా పోషకాహారంను తీసుకోవాలని ఎస్ఐ అన్నారు. విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్,భీంరావ్ దేశాయ్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులు: ఎస్ఐ బిట్ల పెర్సిస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



