Thursday, December 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేటి తరం 'సుమతీ శతకం'

నేటి తరం ‘సుమతీ శతకం’

- Advertisement -

అమర్దీప్‌ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. విషన్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై సాయి సుధాకర్‌ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ చిత్ర టీజర్‌ను ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ విప్‌ జివి ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మంచి సినిమా తీసినందుకు చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు. టీజర్‌ చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని అర్థం అవుతుంది’ అని తెలిపారు. నిర్మాత, నటుడు అశోక్‌ కొల్ల, కంటమనేని శివ, నిర్మాత బెల్లంకొండ సురేష్‌, అతిధి నిర్మాత వంశీ నందిపాటి, యశ్ని గౌడ, నటుడు అర్జున్‌ అంబటి, సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్‌ తదితరులు ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. నిర్మాత కొమ్మాలపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా అమరదీప్‌కు మంచి మైలేజ్‌ తీసుకొస్తుంది. హీరోయిన్‌కు మంచి పేరు రావాలని, దర్శకుడికి ఈ సినిమా ద్వారా మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

సరదాగా సాగే ఈ సినిమా ఎవరి మనోభావాలను ఇబ్బంది కలిగించకుండా మంచి సందేశాత్మకం సాగే చిత్రమిది’ అని తెలిపారు. నిర్మాత సుధాకర్‌ కొమ్మాలపాటి మాట్లాడుతూ, ‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు కుటుంబంతో కలిసి ఎంటర్టైన్‌ అయ్యే విధంగా అనిపించింది. అమర్‌దీప్‌ ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈ తరం రవితేజలా అనిపిస్తాడు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మంచి తెలుగుదనం ఉన్న టైటిల్‌. సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘నన్ను నమ్మి సినిమాను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చిన నిర్మాతకి, నా దర్శక బృందానికి థ్యాంక్స్‌. మంచి సంగీతం, అద్భుతమైన విజువల్స్‌, అలరించే పాటలుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని దర్శకుడు ఎంఎం నాయుడు చెప్పారు. హీరో అమర్దీప్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా వినోదపరుస్తుంది. ఇందులో చాలా మంచి కంటెంట్‌ ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -