బాటిల్లో నింపి విక్రయించాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్
కల్లు ప్యాకెట్లను నిషేధించి, బాటిల్లో నింపి విక్రయించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ మాట్లాడుతూ.. నిజాంబాద్ జిల్లాలో జిల్లావ్యాప్తంగా కల్తీకల్లు అనేటువంటిది కార్మికులందరూ అనారోగ్య పాలు కావడానికి కారణము కల్తీకల్లు ఈ కల్లుకు అలవాటు పడినవారు బానిసైన వారు తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవడం జరుగుతున్నది. ఇదే అదును చూసుకొని వ్యాపారులు ఫ్లోర్ ఓపెన్ లాంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. దాని సేవించిన వారు అనారోగ్యాల పాలై పిచ్చోళ్ళలా తిరుగుతున్నారు.
ఈ పరిస్థితిని చూసి అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తున్నారని అన్నారు. తక్షణమే ఎక్సైజ్ శాఖ వారు సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి అక్రమ వ్యాపారం చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జిల్లా అధ్యక్షులు నల్వాల్ నరసయ్య మాట్లాడుతూ.. కల్తీ కళ్ళు గంజాయి కంటే ప్రమాదకరమైనదని అన్నారు. ప్రస్తుతము నిర్వహిస్తున్నటువంటి ప్లాస్టిక్ కవర్ను నిషేధం చేసి కళ్ళు బాటలలోనే కళ్ళు నింపి విక్రయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రమాదమని తెలిసికూడా ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాంపల్లి సతీష్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
కల్లు ప్యాకెట్లను నిషేధించాలి: కేవీపీఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES