Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వారం రోజుల్లో మరుగుదొడ్ల పనులను పూర్తి చేయాలి

వారం రోజుల్లో మరుగుదొడ్ల పనులను పూర్తి చేయాలి

- Advertisement -

– మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని భవిత సెంటర్ లో మరుగుదొడ్ల నిర్మాణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో భవిత సెంటర్ ను ఆయన పరిశీలించారు. వారం రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణం పనులను పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకురావాలన్నారు. భవిత కేంద్రంలో ఉన్న చిన్నారుల గురించి ట్యూటర్లను అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి వచ్చే చిన్నారులను బాగా చూసుకోవాలని సూచించారు.

అనంతరం చౌట్ పల్లి గ్రామంలో ఎస్సీ, బీసీ హాస్టలను ఆయన సందర్శించారు. ప్రభుత్వం హాస్టళ్లకు సరఫరా చేసిన ఆహార పదార్థాలను, నిత్యవసర సరుకుల నాణ్యతను ఆయన పరిశీలించారు.హాస్టల్లో వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని హాస్టల్ వార్డెన్ లకు సూచించారు. విద్యార్థులు ప్రభుత్వ అందించే సౌకర్యాలను అందిపుచ్చుకొని బాగా చదివి జీవితంలో పైకి ఎదగాలన్నారు. ఆయన వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -