Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్నూతన సర్పంచుల సంఘం అధ్యక్షులుగా తోకల మారుతీ

నూతన సర్పంచుల సంఘం అధ్యక్షులుగా తోకల మారుతీ

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల సర్పంచుల సంఘం కార్యవర్గాన్ని బుధువారం మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా తోకల మారుతీ దార్ కుభీర్ ప్రధాన కార్యదర్శి గా అరేపెల్లి సతీష్ సెరపెల్లి హెచ్ ఉప అధ్యక్షులు గా మెంచు రమేష్ నిగ్వ  గౌరవ అధ్యక్షురాలిగా జాదవ్ సునీతా బాయి కిసాన్ నాయక్ తండా ఎకగ్రీవంగా ఎన్నకయ్యారు. ఈ సందర్బంగా సర్పంచు ల సంఘం అధ్యక్షులు తోకలు మారుతీ మాట్లాడుతూ.. మండలంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ది తో పాటు సర్పంచుల సమస్యలపై, హక్కులపై పోరాడుతానని అన్నారు.

నూతనంగా ఏర్పాట్టిన కార్యవర్గ సభ్యులకు పలువురు శాలవా పూల మాలతో ఘనంగా సన్మాంచారు. కార్యవర్గ ఏర్పాటు పత్రాన్ని ఎంపీడీఓ సాగర్ రెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మడి ప్రవీణ్, గంగామని సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి వ్యవసాయ సహకార సంఘం మాజీ చెర్మన్ రేకుల గంగా చరణ్, గులాబ్ నాయక్, నగేష్,మండల నాయకులు, సర్పంచులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -