Friday, March 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌ నుంచి వెళ్లే నౌకలకు టోల్‌చార్జి : ఇరాన్‌ యోచన

హార్ముజ్‌ నుంచి వెళ్లే నౌకలకు టోల్‌చార్జి : ఇరాన్‌ యోచన

- Advertisement -

యుద్ధం ముగిసిన తర్వాత ఈ నూతన విధివిధానాలు

టెహ్రాన్‌ : ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ను ఇరాన్‌ ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. తన దేశానికి ఆనుకొని ఉన్న ఆ జలసంధి నుంచి నౌకలు రాకపోకలు సాగించాలంటే ఇకనుంచి కొంత రుసుము చెల్లించాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఈ విధానంపై ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు ఇరాన్‌ చట్టసభ సభ్యుడు ఒకరు స్థానిక మీడియాతో పేర్కొన్నారు. నౌకాయానం, ఇంధన రవాణా, ఆహార సరఫరా కోసం హార్ముజ్‌ను ఉపయోగించుకునే దేశాలు ఇక నుంచి ఇరాన్‌కు టోల్‌, ట్యాక్స్‌ కట్టేలా ఒక బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు.

”యుద్ధం ముగిసిన తర్వాత హార్ముజ్‌కు కొత్త విధివిధానాలు వస్తాయి. మాపై ఆంక్షలు విధించిన దేశాలపై మేమూ అలాంటి చర్యలే తీసుకునేలా నిర్ణయాలు ఉంటాయి” అని ఇప్పటికే ఇరాన్‌ నుంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా అమెరికా – ఇజ్రాయిల్‌ నౌకలకే ఆ జలసంధిని మూసివేసినట్టు ఇటీవల ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వెల్లడించారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -