Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ స్థలంలోనే టోల్ ప్లాజా నిర్మించాలి..

ప్రభుత్వ స్థలంలోనే టోల్ ప్లాజా నిర్మించాలి..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్ర శివారులోని 44వ జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న టోల్ ప్లాజా నిర్మాణాన్ని గతంలో చూపించిన ప్రభుత్వ స్థలంలో కాకుండా రైతులకు ఇబ్బంది కలిగే విధంగా తాత్కాలికంగా కొనసాగుతున్న టోల్ ప్లాజా పక్కన నిర్మాణ పనులను ఆపాలని కోరుతూ శుక్రవారం టోల్ ప్లాజా వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం విశాలంగా ఉందని, కేవలం కాంట్రాక్టర్ స్వలాభం కోసం నేషనల్ హైవే అథారిటీ అధికారులు, టోల్ ప్లాజా కాంట్రాక్టర్ సూచనల మేరకు రైతుల భూములను ఆనుకొని నిర్మాణ పనులు చేపట్టారని  దీంతో గత 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు దారి లేక పంటలు పండించే పరిస్థితి ఉండదన్నారు. వెంటనే నిర్మాణ పనులను ఆపి ప్రభుత్వ స్థలంలోనే టోల్ ప్లాజా నిర్మాణ పనులు చేపట్టాలని శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రైతుల పొట్టగొట్టే విధంగా టోల్ ప్లాజా నిర్మాణ పనులు ప్రారంభమైనందున రైతులు కోర్టులో కేసు వేశారు. కోర్టు స్టే ఇచ్చిన సంబంధిత సిబ్బంది నిర్మాణ పనులు చేపట్టడం సబబు కాదన్నారు. విషయం తెలుసుకున్న సీఐ సంపత్ కుమార్ కోర్టు సూచనల మేరకు ప్రస్తుతం నిర్మాణ పనులను ఆపివేయిస్తున్నట్లు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చేవరకు రైతులు ఆందోళన విరమించాలన్నారు. సుమారు గంటపాటు ఆందోళన నిర్వహించిన రైతులు తమకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -