- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 కేజీల బాక్స్ గత నవంబర్‌లో రూ.900 వరకు ఉండగా ప్రస్తుతం రూ.60-80 మాత్రమే పలుకుతోంది. కేజీకి రూ.2-3 మాత్రమే దక్కుతోంది. దీంతో రవాణా ఖర్చులు కూడా మిగలట్లేదని రైతులు వాపోతున్నారు. ఏపీలోని మదనపల్లెలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక బహిరంగ మార్కెట్‌లో కేజీ టమాటా రూ.5-10 వరకు అమ్ముతున్నారు.
- Advertisement -



