టమోటాలను మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తర్వాత వాటిని కడగడం, ఆ వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం చేయకూడదు. తడిగా ఉంటే, బాగా ఆరబెట్టి, ఆపై ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.
ఇతర కూరగాయలతో టమోటాలు ఉంచకూడదు. కూరగాయల బరువు టమోటా మీద పడటంతో అవి పాడయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి ఉంచితే కుళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువ.
టామోటాలను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు వాటిని పేపర్‌లో చుట్టిపెడితే పొడిగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
వంటకు ముందు పసుపు నీటిలో టమోటాలు కడగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చిన టమోటాను పసుపు నీళ్లలో కడిగి ఆరబెట్టాలి. ఇలా చేస్తే టమాటాలు తాజాగా ఉంటాయి.
ప్లాస్టిక్ సంచుల్లో టమాటాలు నిల్వ చేయవద్దు. టమోటాలకు తేమ తగిలితే త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి వీటిని ప్లాస్టిక్ బ్యాగులకు బదులు.. గాలి చొరబడని డబ్బాలు, బుట్టల్లో నిల్వ ఉంచడం మంచిది.
వీటిని వంట కోసం ఉపయోగించి నప్పుడు, ముందుగా పండిన టమోటాలను ఉపయోగిం చండి. మిగిలినవి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
వీటిని కొనేటప్పుడు పచ్చి, వాటిని కొనాలి. ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
టమోటాలు తాజాగా..
- Advertisement -
- Advertisement -