నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 17న (బుధవారం) మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మంగళ,బుధవారాలు ఇవ్వనున్నారు. అలాగే , ఓటు హక్కు వినియోగించుకునేందుకు గానూ ప్రభుత్వ , ప్రయివేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4158 సర్పంచ్ స్థానాలకు, 36434 వార్లులకు నోటిఫికేషన్ వెలువడింది. కాగా, మొత్తం 12,723 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మూడో విడతలో 394 సర్పంచ్.. 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,752 స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు సర్పంచ్ రేసులో నిలిచారు. కాగా, తొలి విడతలో కూడా 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో 414 మంది సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



