Tuesday, February 24, 2026
E-PAPER
Homeఖమ్మంరేపు శతాధిక బాలకవి సమ్మేళనం

రేపు శతాధిక బాలకవి సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
భానూదయ సాహిత్యసంస్థ, మండల విద్యాశాఖ అశ్వారావుపేట సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శతాధిక బాల కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. తెలుగు సాహితీ చరిత్రలోనే ప్రప్రధమంగా విద్యార్థులతో శతాధిక బాల కవి సమ్మేళనం నిర్వహిఔచడం ఇదే ప్రథమం అని, ఈ సమ్మేళనంలో మండలంలోని పలు పాఠశాలల నుండి 110 మంది విద్యార్ధులు పాల్గొంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమం అరుదైన రికార్డుగాను నిలవనుందని మండల విద్యాశాఖాధికారి పి.ప్రసాదరావు, భానూదయ సాహిత్యసంస్థ అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు తెలిపారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న విద్యార్ధులంతా స్థానిక సూర్యస్కూల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు ఉదయం 9.30 కల్లా చేరుకోవాలని తెలిపారు. 

ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు జారె ఆదినారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారిణి బి. నాగలక్ష్మి,సెక్టోరియల్ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -