Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతు బీమాలో మార్పులకు రేపే చివరి గడువు

రైతు బీమాలో మార్పులకు రేపే చివరి గడువు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
రైతు బీమాలో తప్పొప్పులను సరిదిద్దుకునేందుకు, నూతనంగా బీమా చేసుకోవాడొనికి సదుపాయం కల్పిస్తున్నట్టు పెద్ద ఏడ్గి క్లస్టర్ ఏఈఓ సులోచన , నాగల్ గావ్ క్లస్టర్ ఏఈఓ సతీష్, హంగర్గా క్లస్టర్ ఏఈఓ నాందేవ్ , పెద్దగుల్లా క్లస్టర్ ఏఈఓ శ్వేత తెలియజేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఆదేశాలను అనుసారం భూములు కొన్న  రిజిస్టర్ చేసుకున్న రైతులు రైతు బీమా కొరకు దరఖాస్తులు చేసుకునేవాళ్ళు ఆగస్టు 13వ తేదీ చివరి గడువుగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందని పెద్ద ఏడ్గి క్లస్టర్ ఏఈఓ సులోచన తెలిపారు. మంగళవారం నాడు విలేకరులకు ప్రకటన విడుదల చేసి ఏఈఓ సులోచన మాట్లాడారు.

మండలంలోని రైతులు కొత్తగా భూములు కొన్నవారు మరియు కొత్తగా కొన్న రైతుల పేర్ల మీద కల్పించడం జరుగుతుందని అన్నారు.  అదేవిధంగా తప్పులు ఉంటే నామిని  పేర్లు మార్పు , చేర్పులు కొరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో అవకాశం ఇచ్చిందని చివరి తేదీగా ఆగస్టు 13వ తేదీ గడువు విధించింది అని తెలిపారు. మండలంలోని రైతులు ఈ చదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎడ్గి , హంగర్గా క్లస్టర్ , పెద్ద గుల్లా క్లస్టర్, నాగోల్ గావ్ పరిధిలోని రైతులు రైతు వేదికలో  అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించుకోవడం కొనసాగుతోందని తెలిపారు. సమస్యలుంటే క్లస్టర్ కార్యాలయం నాకు రావాలని అనుమానాలు నివృత్తి చేసుకోవాలని మండల రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు , వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img