Thursday, October 16, 2025
E-PAPER
Homeబీజినెస్త్వరలో టాప్‌ 50 స్టార్టప్‌ల గుర్తింపు

త్వరలో టాప్‌ 50 స్టార్టప్‌ల గుర్తింపు

- Advertisement -

– త్వరలో టై హైదరాబాద్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌
నవతెలంగాణ – హైదరాబాద్‌

ఔత్సాహికవేత్తలు, స్టార్టప్‌లకు మద్దతును అందించే టై హైదరాబాద్‌ చాప్టర్‌ అక్టోబర్‌ 31, నవంబర్‌ 1న ఎంటర్‌ప్రిన్యూర్‌ సమ్మిట్‌ను ఏర్పాటు చేస్తోన్నట్లు ప్రకటించింది. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 1500 పైగా ఔత్సాహికవేత్తలు, 100 మంది స్పీకర్లు హాజరు కానున్నారని తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ పగడాల, బోర్డు మెంబర్‌ అభిషేక్‌ రెడ్డి కనకాల మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమ్మిట్‌లో తెలంగాణలోని టాప్‌ 50 స్టార్టప్‌ల జాబితాను విడుదల చేయనున్నామని చెప్పారు. ఇందుకోసం 1000 పైగా దరఖాస్తులను జల్లెడ పట్టామని చెప్పారు. ఇందులో అత్యంత కీలకమైన 50 స్టార్టప్‌లను గుర్తించడం ద్వారా వాటికి గుర్తింపు, మెంటర్‌, ఫైనాన్సియల్‌ మద్దతు లభించనుందన్నారు. దేశంలో వచ్చే పదేళ్లలో తమ సంస్థ 10 లక్షల మంది ఔత్సాహికులను చేర్చుకోవడం ద్వారా కోటి ఉద్యోగాలను సృష్టించడం ద్వారా.. 100 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతేడాది హైదరాబాద్‌ స్టార్టప్‌ల నిధుల సమీకరణ 160 శాతం పెరిగిందన్నారు. తాము నిర్వహించబోయే సమ్మిట్‌లో అన్ని రంగాల ఔత్సాహికవేత్తలు పాల్గొననున్నారని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -