Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

- Advertisement -

ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది : రాష్ట్ర డీజీపీ జితేందర్‌
లొంగిపోయిన మావోయిస్టు సుజాతక్కకు రూ.25 లక్షల రివార్డు


నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టులు భవిష్యత్తు లేని మార్గాన్ని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యయుతంగా సమస్యలపై పోరాడాలని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ పిలుపునిచ్చారు. శనివారం డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యురాలు పోతుల పద్మ, ఎలియాస్‌ కల్పన, అలియాస్‌ సుజాతక్క లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 404 మంది అజ్జాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇందులో కేంద్రకమిటీ, రాష్ట్ర కమిటీలు మొదలుకొని డివిజన్‌ కమిటీ సభ్యులున్నారని తెలిపారు. ‘పోరు వీడండీ గ్రామాలకు తరలిరండీ’ అనే నినాదంతోపాటు మావోయిస్టుల పునరావాసానికి పోలీస్‌ శాఖ తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలిస్తున్నాయని అన్నారు. పోతుల సుజాత స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడని, ఆమె మొదట్లో ఆర్‌ఎస్‌యూ, జన నాట్యమండలిలో పని చేశారన్నారు. 1996లో కమాండర్‌గా విధులు నిర్వహించారని, 2001లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేశారని, అనారోగ్య కారణాలతో సుజాత బయటికి వచ్చారని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 2011 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య అని, ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఇన్‌చార్జిగా ఉన్నారని తెలిపారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై రూ.కోటి రివార్డు ఉంద న్నారు. ఆమెకు రూ.25 లక్షల రివార్డు అందిస్తున్నామన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని డీజీపీ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -