12 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు
పొంగి పొర్లిన వాగులు, అలుగులు పారిన చెరువులు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో శనివారం వేకువజాము నుండి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులు అలుగులు పారాయి. 12 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయింది. కన్నాపూర్ వాగు, మద్దికుంట ఎల్లమ్మ బండ వద్ద, గన్ పూర్ తోపాటు వివిధ గ్రామాల్లో వాగులతోపాటు, ఓర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సిఐ రామన్, తహశీల్దార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వర్ పలు గ్రామాల్లో వాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవసరమైతేనె ఇండ్ల నుండి బయటకు రావాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని సూచించారు. కూలిన ఇండ్లలో గాని, శిథిలవస్తులో ఉన్న ఇండ్లలో నివసించవద్దని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, స్తంభాలను, వ్యవసాయ క్షేత్రాల్లో స్టార్టర్లను, తాకవద్దని పలు సూచనలు చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
రామారెడ్డిలో కుండపోత వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES