- Advertisement -
నవతెలంగాణ -నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ప్రాజెక్టు పొంగిపొర్లిన తర్వాత ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు కు పర్యటకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ప్రాజెక్టు వద్దకు చేరుకొని సందడి చేశారు. ఫ్లో తక్కువగా ఉండటంతో ప్రాజెక్టు పై నుండి జలపాతం కిందికి జరుగుతా ఉంటే ఆ జారే జలపాతాన్ని పర్యటకులు స్నానం చేస్తూ సందడి చేశారు. వందల సంఖ్యలో ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మారుస్తే వేల సంఖ్యలో పర్యటకులు వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -