చర్చలు, దౌత్యానికే ప్రాధాన్యత
భారతీయుల భద్రతే ముఖ్యం
పశ్చిమాసియాలో పరిణామాలపై పార్లమెంట్‌లో మంత్రి జై శంకర్ ప్రకటన
న్యూఢిల్లీ : శాంతికే భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి వుంటుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. చర్చా, దౌత్య వేదికలకు ప్రాధాన్యతనివ్వాలన్నది భారత్ అభిమతమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై సోమవారం ఆయన పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక ప్రకటన చేశారు. తక్షణమే ఉద్రిక్తతల తగ్గింపు నకు చర్యలు తీసుకోవాలని, సంయమనం పాటించాలని కోరారు. పౌరుల భద్రతకు హామీ కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలో పెచ్చరిల్లిన పరిస్థి తులు మనందరికీ తీవ్ర ఆందోళనను కలిగిస్తు న్నాయన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడమే అత్యంత సమర్ధవంతమైన పరిష్కార మార్గమని, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు.ఈ ప్రాం తంలోని అన్ని దేశాల సార్వభౌమాధికారా న్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించా ల్సిందేనని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలోని భారతీయుల సంక్షేమం, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంద న్నారు. అక్కడి పరిణామాలను ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి నిరంతరంగా అక్కడి పరిస్థితులను మదింపు చేస్తున్నామన్నారు.
మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమావేశమై అక్కడి భారతీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించిందన్నారు. ఇంధన భద్రతకు, చమురు, గ్యాస్ సరఫరాకు ఆ ప్రాంతం కీలకమైనది, గల్ఫ్ ప్రాంతానికి భారత్ ప్రధాన వాణిజ్య భాగస్వామి అని, ఏటా దాదాపు 200 బిలియన్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతకు ఎదురవుతున్న పర్యవసానాలపై, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలపై కమిటీ దృష్టి పెట్టిందని చెప్పారు. ఆ ప్రాంతంలోని అన్ని దేశాల అధిపతులతో భారత్ మాట్లాడిందన్నారు. ఆయా దేశాల్లో భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని వారు కూడా హామీ ఇచ్చారన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు, భారతీయుల అభ్యర్ధనలపై స్పందించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. తాజాగా మార్చి 5న ఇరాన్ విదేశాంగ మంత్రి అరగ్చితో మాట్లాడారనని, రాబోయే రోజుల్లో కూడా ఈ సంభాషణలు కొనసాగుతాయని చెప్పారు. ఇరాన్ నౌక ఐఆర్‌ఐఎస్ లావాన్‌కు కోచిలో ఆశ్రయం ఇచ్చామని, మానవతా ప్రాతిపదికనే ఈ అనుమతి ఇచ్చామని చెప్పారు.
”మనకు సంబంధించినంత వరకు భారతీయుల ప్రయోజనాలే ప్రధమ ప్రాధాన్యత. ఈ సున్నితమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో మన ఇంధన సంస్థల ప్రయత్నాలకు అవసరమైన చోట భారత దౌత్యం మద్దతిస్తుంది.” అని జైశంకర్ స్పష్టం చేశారు.
శాంతివైపే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



