Monday, December 1, 2025
E-PAPER
Homeజిల్లాలునిజామాబాద్ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్

నిజామాబాద్ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ అర్బన్ పరిధిలో నిర్వహించిన అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి అభివృద్ధి చెందేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో సహాయపడతాయని పేర్కొన్నారు. శారీరక, మానసిక వికాసానికి క్రీడలు అత్యవసరమని, క్రమశిక్షణ, టీమ్‌వర్క్, పోటీతత్వం వంటి విలువలను పెంపొందిస్తాయని అన్నారు.nప్రతిభావంతులైన విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తోందని తెలిపారు. ప్రతి పాఠశాలలో క్రీడలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మహేష్ గౌడ్ వివరించారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహించిన ఆయన, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మాజీ మేయర్ ఆకుల సుజాత, పెద్ద సంఖ్యలో నగరంలోని ఆయా పాఠశాలల క్రీడాకారులు, పి ఈ టి లు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -