Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్

నిజామాబాద్ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక సూచనలు చేశారు.నగరంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్‌లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను వేగవంతం చేయాలని, ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నగరస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నిజామాబాద్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో ప్రతిబింబించే విధంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పారదర్శకతతో పనులు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -