నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట మాజీ సర్పంచ్, మండల మాజీ ఎంపిపి, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి తల్లి అయిత లక్ష్మీబాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,జనగామ లక్ష్మీ రాజo, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES