నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ కలెక్టరేట్ లో వరి కొనుగోలు పై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డిఎం సివిల్ సప్లై అధికారులు, జిల్లా సిపి సాయి చైతన్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్,వివిధ రైస్ మిల్లుల యజమానులు, సంబంధిత అధికారులతో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో వరి కొనుగోలులో జరుగుతున్న జాప్యం, లారీల కొరత, హమాలీల కొరత,రైస్ మిల్లు వద్ద ధాన్యం కలిచేయడం వంటి పలు అంశాలపై మహేష్ కుమార్ గౌడ్ రెండు గంటలు సుదీర్ఘ చర్చ జరిపారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఆకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం,రైతుల ఇబ్బందులను తెలుసున్న మహేష్ కుమార్ గౌడ్ వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.పారాబాయిల్డ్ రైస్ శాతాన్ని పెంచే విధంగా పౌరసరఫరాల మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు పాల్గొన్నారు.
వరి కొనుగోలు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన టీపీసీసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES