నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని మచ్కల్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్నాయని, ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం… ముధోల్ నుండి తన కుమార్తెతో కలిసి బైంసా మండలం సిద్దుర్ గ్రామానికి చెందిన హైమద్ మోటార్ సైకిల్ పై తన స్వగ్రామానికి వెళ్తుండగా.. అదే సమయంలో దేగాం వైపు నుండి ముధోల్ వైపు వస్తున్న ట్రాక్టర్ ఎదురు ఎదురుగా ఢీకొన్నయి. దీంతో హైమద్ తో పాటు వారి కుమార్తె, ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీ.. ముగ్గురికి గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



