Tuesday, December 30, 2025
E-PAPER
Homeక్రైమ్ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. స్టాఫ్ నర్సు మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. స్టాఫ్ నర్సు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మెండోర
మండల పరిధిలోని పోచంపాడ్ గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని స్టాప్ నర్సు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం .. పోచంపాడు గ్రామానికి చెందిన బొమ్మల ప్రియాంక (43) అదే గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లంచ్ చేసాక తన తమ్ముడి మోటార్ సైకిల్ పై స్కూల్ కి వెళుతుండగా.. వెనకవైపు నుండి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ వేముల మహేష్ తన ట్రాక్టర్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ మోటార్ సైకిల్ ను ఢీకొంది. దీంతో అక్కాతమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ప్రియాంకను నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందారు. తమ్ముడు గాయాలతో ప్రాణహాని నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -