Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – ఆలేర్ రూరల్
ఆలేరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై అధికారులు చర్యలు చేపట్టి ఐదు ట్రాక్టర్లను పట్టివేశారు. మండల పరిధిలో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఐ వినయ్ కుమార్ ఇచ్చిన ట్రాక్టర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

దొప్పా మహేష్ (TG 30 TR 4101), ఊట్కూరి బాలరాజు (TS 30 TA 2305), బండి రాజు (TG 30 T 1390), దాడిగె రవి (TG 30 A 8310), రాపాక వెంకటేష్ (TG 30 A 0570)  మందనపెల్లి  చెందిన ట్రాక్టర్లు పట్టుబడ్డాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్లపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -