– కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ : భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశలో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించే లక్ష్యంతో జరుగుతోన్న ఈ చర్చల్లో వేగం పెరిగిందని తెలిపారు. చివరి సారిగా ఇరు దేశాల మధ్య డిసెంబర్ 11న చర్చలు జరిగాయి. అమెరికాతో తాము ఇప్పటికీ జరుపుతోన్న చర్చలు తుది దశలో ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్‌లోని ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి మూడు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేశామని ఆయన తెలిపారు. ఇది పాశ్చత్య ఆర్థిక వ్యవస్థలతో భారత్‌కు పెరుగుతోన్న సంబంధాలకు నిదర్శనమన్నారు. ఫైవ్ ఐస్ గ్రూపులో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, అమెరికా ఉన్నాయి. తాము కెనడాతోనూ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరపనున్నామన్నారు. పాడి రంగంలో విదేశీ సంస్థలకు అనుమతి, ఆంక్షలను ఎత్తివేయలేమని పియూష్ గోయల్ తెలిపారు.
తుది దశలో యూఎస్‌తో వాణిజ్య చర్చలు
- Advertisement -
- Advertisement -



