నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా-చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరుదేశాలు పరస్పర సుంకాలను తగ్గించుకునేందుకు 90 రోజుల ఒప్పందంపై సంతకం చేశాయి. తాజా ఒప్పందం ద్వారా అమెరికా.. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 145% నుంచి 30%కి 90 రోజుల పాటు తగ్గించింది. అలాగే చైనా.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 125% నుండి 10%కి 90 రోజుల పాటు తగ్గించింది. ఈ ఒప్పందం జెనీవాలో రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఖరారైంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రతీకార సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచదేశాలపై ట్రేడ్ వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య పలు దేశాలపై టారిఫ్‌ల పెంపు 90 రోజులపాటు వాయిదా వేసింది అమెరికా. కానీ చైనాకు ఎలాంటి మినహయింపు ఇవ్వకుండా అంతకంతాకు బీజింగ్ దిగుమతులపై భారీయోత్తున సుంకాలు విధించారు. చైనా కూడా యూఎస్ చర్యలకు బెదరకుండా..అమెరికా దిగుమతులపై కూడా అంతే స్థాయిలో సుంకాల బాణాలను సంధించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు దేశాలు జెనీవా వేదికగా రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు కొనసాగించాయి. అంతిమంగా సుంకాల శాతాన్ని తగ్గించుకొని ప్రపంచదేశాలకు తీపీ కబురు చెప్పాయి.
యూఎస్-చైనా మధ్య కీలక ఒప్పందం
- Advertisement -
- Advertisement -