Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎనుమాముల మార్కెట్‌లో వ్యాపారుల ఆందోళన

ఎనుమాముల మార్కెట్‌లో వ్యాపారుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-కాశిబుగ్గ
గాయత్రి చిల్లీస్‌ యాజమాని తిరుపతి వల్ల నష్టపోయిన వ్యాపారులకు న్యాయం చేయాలని గురువారం వ్యాపారస్తులు వరంగల్‌ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. గాయత్రి చిల్లీస్‌ యాజమాని తిరుపతి గతంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో ఐపీ పెట్టారని, ఇప్పుడు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రూ.3 కోట్లతో పరారై, పలువురు వ్యాపారులకు ఐటీ నోటీసులు పంపించారని అన్నారు. పోలీసు ఉన్నత అధికారులు తిరుపతిపై కఠిన చర్యలు తీసుకొని సంబంధిత వ్యాపారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా వ్యాపారుల ఆందోళనతో ఉదయం 7గంటలకు ప్రారంభం కావలసిన మిర్చి కొనుగోలు ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభం కావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న యాదగిరిపై గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇటీవల మార్కెట్‌లోకి బయట వ్యక్తులు వచ్చి మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లిన ఘటనల నేపథ్యంలో అనుమానస్పదంగా తిరుగుతున్న వారిని సెక్యూరిటీ గార్డ్‌ ప్రశ్నించగా వారు దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డ్‌ యాదగిరిని మార్కెట్‌ సిబ్బంది ఎంజీఎంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -