Monday, November 3, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రభత్ భేరిలో సంప్రదాయం- సంస్కృతి, భక్తి- ధర్మం

ప్రభత్ భేరిలో సంప్రదాయం- సంస్కృతి, భక్తి- ధర్మం

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్:

మూడు రాష్ట్రాలకు సరిహద్దులో గల మద్నూర్‌ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రభాత్ పేరి ద్వారా సంప్రదాయం సాంస్కృతి భక్తి ధర్మం అన్ని రకాల కలగల్సి ఆధ్యాత్మికంగా శోభ చేస్తున్న ఈ ప్రభాత్ పేరీ కార్యక్రమం  వైభవంగా 27వ రోజు కు చేరిన భక్తి ఘనత మద్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జంగం అప్పలు సంఘయప్ప శంకరప్ప మార్గదర్శకంలో కొనసాగడం గ్రామంలో ప్రతిరోజు శంకు నాదం భజన నాదంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు ఈ శంకు నాదం భజన నాదం కార్యక్రమంలో చిన్నా పెద్ద తేడా లేకుండా చిన్నారులు పెద్దలు యువకులు మహిళలు పాల్గొంటున్నారు.

చుట్టుప్రక్కల ఎక్కడ లేని విదంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో కార్తీకమాస ఆధ్యాత్మిక కాంతి వెలుగుల మధ్య కొనసాగుతున్న ప్రభాత్ పేరి కార్యక్రమం 27వ రోజుకు చేరుకుంది. మొత్తం 33 రోజుల పాటు నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక పుణ్యధారను ప్రసరిస్తోంది.

ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి, ఉదయం 5 గంటలకు బాలాజీ మందిరం నుండి ప్రారంభమయ్యే ప్రభాత్ పేరిలో భక్తులు గొప్ప భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. శంఖనాదం, హారతులు, భజనలు, దేవనామస్మరణలతో గ్రామం అంతా ఆధ్యాత్మికతతో మార్మోగుతోంది.గ్రామంలోని గల్లీ గల్లీల్లో ప్రభాత్ పేరి తిరుగుతుండగా, ఇంటి ముందురావడమే పుణ్యం అనుకుని గ్రామస్తులు భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. జంగం మహేశ్వరులకు హారతులు చేస్తూ గ్రామస్థులు పూజలతో పాల్గొంటున్నారు.ప్రతి రోజు మార్గమధ్యలో ఉన్న ఆలయాల్లో హారతులు చేసి, తీర్థప్రసాదం అందించడం ఈ పేరి ప్రత్యేకత. భక్తులు “మద్నూర్‌లో జరిగే ఈ ప్రభాత్ పేరి ఇక్కడి సంప్రదాయం, సంస్కృతి, మతపరమైన చైతన్యానికి ప్రతీక. ప్రతీ సంవత్సరం ఇది జరగడం గర్వకారణం” అని పేర్కొంటున్నారు.ఈ పవిత్ర పేరి నిర్వహణలో మార్వాడి రాజస్థాన్ సమాజ్ పెద్దలు ముందుండి సేవ చేస్తున్నారు. గ్రామంలోని అన్ని వర్గాలు, అన్ని కులాల భక్తులు సమానంగా పాల్గొనడం విశేషం. ముందుండి నడుస్తున్న జంగం అప్పల మార్గదర్శకత్వంలో భక్తులు భజనలు పాడుతూ, శివనామస్మరణ చేస్తూ కార్తీకమాస పవిత్రతను చాటుతున్నారు.సంప్రదాయం, సంస్కృతి, భక్తి, ధర్మం, ఆరోగ్యం అన్నీ కలగలిసి ఉన్న ఈ ప్రభాత్ పేరి గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తెస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -